హైదరాబాద్, 2 జూలై (హి.స.)
బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలవాలని రాష్ట్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పదవికి మంత్రులే ఎసరు పెడుతున్నారని, రెండు పార్టీలు కలిసి పనిచేయాలని పావులు కదుపుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మంత్రుల్ని ఏమీ అనలేక బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్యాయం చేశాయన్నారు. రాష్ట్రంలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెరపైకి బనకచర్ల అంశాన్ని తీసుకొచ్చాయన్న ఆయన.. రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. నీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూర్చుని మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. సమస్యలు పరిష్కారం అవ్వకపోతే కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..