కేశవ్ మెమోరియల్ కాలేజీలో మాక్ పార్లమెంట్.. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, 2 జూలై (హి.స.) భారత దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ ఎమర్జెన్సీ పై బీజేపీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలోనే బుధవారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో మాక్ పార
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

భారత దేశంలో ఎమర్జెన్సీ విధించి 50

ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ ఎమర్జెన్సీ పై బీజేపీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలోనే బుధవారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మాక్ పార్లమెంట్ను బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సెషన్ లో కాంగ్రెస్ ఎమర్జెన్సీకి 50 ఏళ్ల సందర్భంగా..ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పై చర్చ చేపట్టారు. కాగా చర్చలో విద్యార్థులు, మహిళా మోర్చ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి చేరుకొని మాక్ పార్లమెంట్ ను పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande