మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
హైదరాబాద్, 2 జూలై (హి.స.) మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు. ఎన్నికల కోసం 500 ఎకరాల్లో నుండి 16 ఎకరాలు అమ్మేశానని చెప్పారు. దీంత
ఎన్నికల కమిషనర్


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు. ఎన్నికల కోసం 500 ఎకరాల్లో నుండి 16 ఎకరాలు అమ్మేశానని చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక తాజాగా కొండా సురేఖను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒక అభ్యర్థి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసినట్టు కొండా సురేఖ భర్త మురళి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి కొండా సురేఖను అనర్హురాలిగా ప్రకటించాలని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande