శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.కొనసాగుతోంది
అమరావతి, 2 జూలై (హి.స.) సున్నిపెంట సర్కిల్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 63,156 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులుగా ఉంది. జలా
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.కొనసాగుతోంది


అమరావతి, 2 జూలై (హి.స.)

సున్నిపెంట సర్కిల్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 63,156 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. పస్తుత నీటినిల్వ 164.7 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande