హైదరాబాద్, 2 జూలై (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అన్ని జిల్లాల్లో ఘనంగా జరిపేందుకు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతా జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధికశాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా రోశయ్యకే దక్కుతుంది. హైదరాబాద్లోని ధరమ్ కరమ్ ఏరియాలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నివసించారు. అందుకని ఈ ఏరియాలోని ఒక వీధికి రోశయ్య పేరు పెట్టాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు. ఆయన ఇంటికి దగ్గరలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. లక్షీకాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహాన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..