రైతుల పంపు సెట్ల కు ఉచితంగా సౌర విద్యుత్.అందిస్తామని. ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
అమరావతి, 2 జూలై (హి.స.) కుప్పం: రైతుల పంపుసెట్లకు ఉచితంగా సౌర విద్యుత్‌ అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్‌ ఛార్జీలు చెల్లించే పనిలేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం
రైతుల పంపు సెట్ల కు ఉచితంగా సౌర విద్యుత్.అందిస్తామని. ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు


అమరావతి, 2 జూలై (హి.స.)

కుప్పం: రైతుల పంపుసెట్లకు ఉచితంగా సౌర విద్యుత్‌ అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్‌ ఛార్జీలు చెల్లించే పనిలేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రూ.1292.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తుమ్మిశిలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ సభలో చంద్రబాబు మాట్లాడారు. కుప్పం రూపులేఖలు మార్చబోతున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా నియోజకవర్గం నిలవబోతోందని చెప్పారు.

‘‘అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ఉండాలి. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. కుప్పం ప్రజలు తొమ్మిదిసార్లు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. వైకాపా పాలనతో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. అది తలచుకుంటే భయమేస్తోంది. వ్యవస్థలను నాశనం చేశారు. గుంతలు లేని రోడ్లు చేస్తామని చెప్పాం.. పూర్తిచేశాం. కుప్పంలో రూ.1292.74కోట్లతో పనులు చేపట్టాం. రూ.3829 కోట్లతో హంద్రీనీవా ద్వారా చివరి ఆయకట్టుకు నీళ్లిస్తాం. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి నియోజకవర్గంగా కుప్పం నిలిచేలా చర్యలు చేపడతాం. పీఎం సూర్యఘర్ కింద మూడు కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీసీలకు రూ.98 వేల రాయితీ ఇస్తాం. కుప్పం ప్రాంతానికి విమానాశ్రయం వస్తుంది. కుప్పం-హోసూరుకు సమాంతరంగా మరో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయి’’ అని చంద్రబాబు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande