తెలంగాణ, నల్గొండ. 2 జూలై (హి.స.)
ప్రస్తుతం వ్యవసాయ సీజన్
కొనసాగుతున్నందున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. బుధవారం ఉమ్మడి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి నల్గొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, అందుకే అన్నదాతలకు ఎలాంటి కష్టం రాకుండా తోడుగా నిలిచామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు