ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
తెలంగాణ, ఖమ్మం. 2 జూలై (హి.స.) గుడిసెల్లో ఉండే నిరుపేదలకే తొలివిడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చిమ
మంత్రి తుమ్మల


తెలంగాణ, ఖమ్మం. 2 జూలై (హి.స.)

గుడిసెల్లో ఉండే నిరుపేదలకే తొలివిడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చిమ్మపూడి లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా గ్రామాల్లో పూరి గుడిసె లేకుండా అర్హులందరికీ ఇండ్లు అందించాలని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ చేరాలన్నారు. అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, వారి ఎదుగుదలను మానిటరింగ్ నిరంతరం చేయాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande