కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు మహిళా కమిషన్ నోటీసులు
హైదరాబాద్, 2 జూలై (హి.స.) మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 21న గాంధీభవన్ ప్రెస్మీట్లో ఫిరోజ్ ఖాన్ మహిళల్ని అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో అతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహ
ఫిరోజ్ ఖాన్


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 21న గాంధీభవన్ ప్రెస్మీట్లో ఫిరోజ్ ఖాన్ మహిళల్ని అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో అతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని కమిషన్ భావించింది. ఈ మేరకు తను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 4న విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande