సిగాచి వద్ద బాధిత కుటుంబాల ఆందోళన.. యాజమాన్యం, పోలీసులతో వాగ్వాదం
హైదరాబాద్, 2 జూలై (హి.స.) సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు తమవాళ్ల ఆచూకీ చెప్పాలంటూ సిగాచి పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు బుధవారం ఆందోళనకు దిగాయి. గల్లంతైన తమ వారి గురించి యాజమాన్యం గాని, పోలీసులు గాని పట్టించ
సిగాచి ప్రమాదం


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో

మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు తమవాళ్ల ఆచూకీ చెప్పాలంటూ సిగాచి పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు బుధవారం ఆందోళనకు దిగాయి. గల్లంతైన తమ వారి గురించి యాజమాన్యం గాని, పోలీసులు గాని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కంపెనీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదం జరిగింది. మృతుల సంఖ్య, ఆచూకీ తెలియనివారి వివరాలపై స్పష్టత రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాలు చెప్పేందుకు జాప్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మృతదేహాలను తమవారికి అప్పగించేందుకు డీఎన్ఏ టెస్టులు చేస్తున్నా.. తమ వారి వివరాలు ఎప్పుడు చెప్తారంటూ కన్నీరు పెడుతున్నారు. మృతుల వివరాలు వెల్లడించడంలో గందరగోళం, గల్లంతైనవారి వివరాలు ఇంకా తెలియకపోవడం, సహాయకచర్యల్లో జాప్యం నెలకొనడంతో తమ వాళ్లు ఉన్నారో లేరో చెప్పాలని ఆర్తనాదాలు పెడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande