హైదరాబాద్, 2 జూలై (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు అధఃపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా అని సీఎంను హరీశ్ రావు హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్రావు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
సీఎం పదవిని అందరం గౌరవిస్తాం. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతతో మాట్లాడుతాడు, నిజాలు మాట్లాడుతాడు అని విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన సీఎం రాజ్యాంగబద్దమైన పదవిలో అంటూ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడు. కుక్క తోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో ఉప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అబద్దాలు మాట్లాడుతున్నాడు. తప్పులు, అబద్దాలు మాట్లాడినప్పుడు పాఠకులకు ప్రజలకు వాస్తవాలు చేరవేసే బాధ్యత మీడియాపై ఉంది. నిజాలను ప్రసారం చేసే గొప్పతనం మీడియాకు ఉంది అని హరీశ్రావు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..