హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, 2 జూలై (హి.స.) హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, భూములను రైతన్నలకు తిరిగి ఇస్తా
కేటీఆర్


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, భూములను రైతన్నలకు తిరిగి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఏడాదిన్నరగా ఇవ్వడం లేదని, మీరాఖాన్పేటలోని లేఅవుట్లో రైతులకు పొజీషన్ ఇస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి, తమ కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఫార్మాసిటీ భూములను కొట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande