కూరగాయాల ముసుగులో పశువుల అక్రమ రవాణా..
తెలంగాణ,ములుగు. 2 జూలై (హి.స.) అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ ఏటూరు నాగారం అటవీ శాఖ చెకోపోస్టు వద్ద బుధవారం పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు డీసీఎం వ్యాన్లో అక్
అక్రమ రవాణా


తెలంగాణ,ములుగు. 2 జూలై (హి.స.)

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ ఏటూరు నాగారం అటవీ శాఖ చెకోపోస్టు వద్ద బుధవారం పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది.

ఒడిశా నుంచి హైదరాబాద్కు డీసీఎం వ్యాన్లో అక్రమంగా పశువులను తరలిస్తూ.. అవి కనిపించకుండా కూరగాయల ట్రేలను అడ్డుపెట్టారు. ఏటూరు నాగారం చెక్ పోస్టు వద్ద అటవీశాఖ అధికారులను గమనించిన డీసీఎం డ్రైవర్ వేగం పెంచాడు. దీంతో అధికారులు పోలీసులు రెండు కిలోమీటర్ల మేర డీసీఎం వ్యాన్ను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు వెలుగు చూసింది.

దీంతో సదరు అటవీశాఖ సిబ్బంది, అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వ్యాన్ స్వాధీనం చేసుకొని, పశువులను భూపాలపల్లిలోని గోశాలకు తరలించారు. స్వాధీనం చేసుకున్న వ్యాన్లో 28 పశువులు ఉన్నాయని, కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande