హైదరాబాద్, 2 జూలై (హి.స.)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలకు ఇవాళ అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ సమస్య వల్ల ఎస్బీఐ సేవలకు బ్రేక్ పడింది. దీంతో ఆ బ్యాంకుకు చెందిన ఆన్లైన్ సర్వీసులు స్తంభించిపోయాయి. యోనో, ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ, ఐఎన్బీ, ఐఎంపీఎస్ సర్వీసులు నిలిచిపోయాయి. ఎస్బీఐ మొరాయిస్తున్న అంశాన్ని డౌనిడిటెక్టర్ ద్వారా గుర్తించారు. ఇంటర్నెట్లో ఎస్బీఐ సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుమారు 400 కస్టమర్లు ఫిర్యాదు చేశారు. డౌన్స్టిటెక్టర్లో ఈ విషయాన్ని తేల్చారు. అయితే ఎస్బీఐ మధ్యాహ్నం రెండు గంటలకు కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకుకు చెందిన అన్నీ సర్వీసులను రిస్టోర్ చేసినట్లు చెప్పింది
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్