అభివృద్ధి పథంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం : ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
హైదరాబాద్, 2 జూలై (హి.స.) సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో బు
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో బుధవారం సుమారు రూ.75 లక్షల విలువజేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. చిలకలగూడలోని వెంకటేశ్వర నగర్లో రూ.25 లక్షలు, మార్కండేయ నగర్లో రూ.28 లక్షలతో రోడ్డు నిర్మాణం పనులు, సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో రూ.14 లక్షల ఖర్చుతో మరమ్మత్తు పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అధికారులు నిర్లక్షంగా వ్యవహరించరాదని సూచించారు. అధికార యంత్రాంగం వర్షా కాలంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande