హైదరాబాద్, 2 జూలై (హి.స.)
సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని
ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షి నటరాజన్కు మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మరికొన్ని డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉందన్నారు.
స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..