ప్రతి డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, 2 జూలై (హి.స.) రామంతాపూర్ డివిజన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా బుధవారం ఏడీఆర్ఎం హాస్పిటల్ నుండి కార్డినల్ గ్రేసెస్ స్కూల్ వరకు 1 కోటి 30 లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండ
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

రామంతాపూర్ డివిజన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా బుధవారం ఏడీఆర్ఎం హాస్పిటల్ నుండి కార్డినల్ గ్రేసెస్ స్కూల్ వరకు 1 కోటి 30 లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికీ అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు.. రామంతాపూర్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande