ఏపీలో టీచర్లకు గుడ్‌న్యూస్.. వారికి భారీగా జీతాలు పెంచుతూ జీఓ
అమరావతి, 2 జూలై (హి.స.)ఏపీలో ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న టీచర్లకు (AP Out Sourcing Teachers) రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1659 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ జీఓ (GO) జారీ చే
ఏపీలో టీచర్లకు గుడ్‌న్యూస్.. వారికి భారీగా జీతాలు పెంచుతూ జీఓ


అమరావతి, 2 జూలై (హి.స.)ఏపీలో ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న టీచర్లకు (AP Out Sourcing Teachers) రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1659 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ జీఓ (GO) జారీ చేసింది. జూనియర్ లెక్చరర్లకు రూ.25 వేలు నుంచి రూ.40 వేలు జీతం ఇస్తుండగా..ఇకపై వారి జీతంరూ.31,250 నుంచి రూ.65 వేలు వరకూ పెంచింది. అలాగే 18 మంది పీజీటీలకు రూ.25 వేలుగా ఉన్న జీతాన్ని రూ.31,250కి పెంచారు.SoEs/CoEs ఉద్యోగులకు సైతం రూ.49 వేల నుంచి రూ.61,250కి, అసిస్టెంట్ కోచ్ లకు రూ.22 వేల నుంచి రూ.27,500కు వేతనం పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓలో పేర్కొంది. ప్రభుత్వం జీతాలు పెంచడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande