శ్రీశైలం, 2 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. మంగళవారం (జులై 1) నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో మొదటి రోజు భక్తులు భారీగా తరలిరావటంతో.. ఆధార్ నమోదు లేకుండా భక్తులకు కూపన్లు ఇచ్చారు.మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు 1200 మంది భక్తలకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, రోజుకు 1000 మంది చొప్పున శ్రీశైలంలో జ్యోతిర్లింగ స్పర్శ దర్శనానికి అనుమతిస్తూ అధికారులు ప్రకటించారు. గతంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిలిపివేసిన ఈ సేవలు.. మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభిస్తున్నారు. ప్రతివారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లోనే ఈ స్పర్శ దర్శనం ఉంటుంది. శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కేవలం శ్రీశైలంలో, కాశీలో మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి