అమరావతి, 2 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పల్లెల్లో ప్రగతి వెలుగులు నింపుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పేర్కొన్నారు. ఈ రోజు ఎక్స్‌లో ఒక పోస్టు చేశా రు. గ్రామీణాభివృద్ధి శాఖ (Department of Rural Development) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఫారం పాండ్స్ (Farm Ponds) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకువచ్చామని ఆయన వివరించారు. అనావృష్టి పరిస్థితుల్లో సైతం అన్నదాత ఇంట సిరులు పండించేందుకు ఫారం పాండ్స్ దోహదపడతాయని తెలిపారు. నిస్తేజమైన భూముల్లో జీవం నింపడంతో పాటు భూగర్భ జలాల వృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఉపాధి శ్రామికులకు పని కల్పించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఫారం పాండ్స్ ద్వారా సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్ధ్యాన్ని వృద్ధి చేయగలిగామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి