నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా. 20 జూలై (హి.స.) ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భరోసా ఇచ్చారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఆదివారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో పర్యటించారు. వివిధ వార్డ
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా. 20 జూలై (హి.స.)

ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు

ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భరోసా ఇచ్చారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఆదివారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో పర్యటించారు. వివిధ వార్డుల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్దిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇసుక, లేబర్ సమస్యలతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande