న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.):
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో నా తొలి పర్యటన ఇది.
పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కలసి ఆశీర్వాదం తీసుకుంటూ, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం వారి మార్గదర్శనం కోరుతున్నాను.
ఈరోజు సునిల్ బన్సల్ గారిని, అర్వింద్ మీనన్ గారిని, నితిన్ గడ్కరీ గారిని కలిశాను. రేపు పార్లమెంటులో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని, కేంద్ర హోం & సహకార శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కలవబోతున్నాం.
కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.
ఒకవైపు పార్లమెంటులో జరుగుతున్న అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్ అవుతున్న పరిస్థితి. అటువంటి వారు బిజెపి మీద విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 19 నెలల్లో ఢిల్లీకి మొత్తం 46 సార్లు వెళ్లారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ కీలక నేతలు ఆయనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కాని మన ప్రధాని మోదీ గారు, కేంద్రమంత్రులు మాత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనివ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లే.
బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయడం అన్యాయం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
కానీ ఆర్డినెన్స్ రాకముందే, అందులో 10% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడం బాధాకరం. బిజెపి మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే కేబినెట్ లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానం కలుగుతోంది.
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50 శాతం క్యాప్ మించుతుంది.
బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 లో సవరణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చూస్తోంది.
అసలు మీకు 9వ షెడ్యూల్ లో పంపించేటువంటి ప్రక్రియ మీకు తెలుసా? మీకు న్యాయసలహాదారులు చెప్పలేదా?
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చూస్తోంది. అసలు 9వ షెడ్యూల్‌లో చేర్చే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి తెలుసా? మీ న్యాయ సలహాదారులు ఏమన్నారు?
1973లో కేశవనంద భారతీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. 9వ షెడ్యూల్‌లో చేర్చినా, ఆ చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుంది.
జయలలిత గారు తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చినా, అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంకా తుది నిర్ణయం రాలేదు.
తమిళనాడులో జయలలిత గారు రిజర్వేషన్ల విషయంలో ప్రయత్నం చేశారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి మైనారిటీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చించారు. కానీ దానికి ఏమైంది? ఇప్పటికీ ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. తుది తీర్పు రాలేదు.
కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ కోసం 9వ షెడ్యూల్‌ను చూపిస్తూ మళ్లీ మళ్లీ ప్రజలను మభ్యపెట్టడం సబబుకాదు.
2006 I.R. కోహ్లీ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే పునరుద్ఘాటించింది. కేశవనంద కేసులో 9వ షెడ్యూల్‌కి సంబంధించి పేర్కొన్న అబ్జెక్షన్లు ఇంకా వర్తిస్తాయని పేర్కొంది.
ఈ విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేబినెట్‌కు, న్యాయసలహాదారులకు తెలియకపోవడం విచారకరం.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. బీసీలను మోసం చేసినందుకు, దగా చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.
కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పు తెలుసు, సెక్షన్ 285లో సవరణ అవసరం అన్నది తెలుసు.. అయినా ఎందుకు అసలు చర్చించట్లేదు?
కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం ద్వారా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి… ఈ అంశంలో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని వారికి తెలిసే ఉంటుంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తెలిసీ కూడా, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 లో సవరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిసీ ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు చర్చించకుండా, అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకం ఆడుతున్నారు.
ఓటుబ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యంగా మారాయి.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై బిల్లు తీసుకొచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది.
ఇప్పటికైనా కేంద్రంపై నిందలు వేయకుండా, 42% రిజర్వేషన్లను తాము హామీ ఇచ్చినట్టుగానే అమలు చేయాలి.
మతపరమైన రిజర్వేషన్ల విషయంలో మాత్రం బీజేపీ స్పష్టంగా వ్యతిరేకంగా ఉంటుంది.
కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకాలు చేస్తోంది.
బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 9వ షెడ్యూల్ విషయమై ఎందుకు చర్చించలేదు?
మధ్యప్రదేశ్‌లో 50% పైగా రిజర్వేషన్లు అమలయ్యాయి. ఆ విధానాలను కాంగ్రెస్ అధ్యయనం చేయాలి.
కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై.. ఆర్డినెన్స్‌లో ఏమి పొందుపరిచారో ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు?
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ప్రకారం రిజర్వేషన్ల కోసం శాసనసభలో సవరణ చేయాలి. మరి ఎందుకు చేయలేదు?
హైకోర్టు చివాట్లు పెట్టేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించలేదు. ఇది బాధాకరం.
మా పార్టీలో ఎవరికైనా క్రమశిక్షణ లేకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. బిజెపిలో కొత్త –పాత అనే తేడా లేదు. ఈ తేడాలన్నీ కొంతమంది కావాలనే సృష్టిస్తున్న నెరేషన్.
మా పార్టీలో నాయకులు ఎవ్వరైనా పార్టీకి నష్టం చేసినా.. క్రమశిక్షణ తప్పినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.
రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే కృషి చేస్తాను.
నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు ఉన్నా జాతీయ నాయకత్వం వాటిని పరిష్కరిస్తుంది.
కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు ఒకే తాను ముక్కలు. గతంలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇద్దరూ కలిసి ఎందుకు వెళ్లారు?
ఇప్పటికైనా కేంద్రంపై నిందలు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. తాము ఎన్నికల హామీగా ప్రకటించినట్లుగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. ఈ విషయంలో మతపరమైన ఆధారంగా రిజర్వేషన్లకు బిజెపి స్పష్టంగా వ్యతిరేకిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు