లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 442 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..!
హైదరాబాద్, 21 జూలై (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25వేల ఎగువన ముగిసింది. ఆటో, రియాల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో లాభపడ్డాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,918.53 పాయింట్ల వద్ద సెన్సెక్
స్టాక్ మార్కెట్


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25వేల ఎగువన ముగిసింది. ఆటో, రియాల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో లాభపడ్డాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,918.53 పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. చివరలో కొనుగోళ్లతో లాభపడింది. ఇంట్రాడేలో 81,518.66 కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 82,274.03 పాయింట్ల మార్క్్ను తాకింది. చివరకు 442.62 పాయింట్లు పెరిగి.. 82,200.34 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 122.30 పాయింట్లు పెరిగి 25,090.70 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. రంగాలవారీగా చూస్తే ఆటో, క్యాపిటల్ గూడ్స్, ప్రైవేట్ బ్యాంక్, పవర్, రియాల్టీ, మెటల్ 0.5-1 శాతం పెరిగాయి. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande