టాలీవుడ్ పై బాబు మోహన్ వివాదాస్పద కామెంట్స్!
హైదరాబాద్, 20 జూలై (హి.స.) టాలీవుడ్ ఇండస్ట్రీపై సీనియర్ నటుడు బాబు మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితుడిని అని... తనకు సినిమా అవకాశాలు తగ్గాయని బాంబు పేల్చారు. తాజాగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కుల వివక్షత పై ఆయన స్పందించారు. చిత్ర పరిశ్రమలో తన
బాబు మోహన్


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

టాలీవుడ్ ఇండస్ట్రీపై సీనియర్ నటుడు బాబు మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితుడిని అని... తనకు సినిమా అవకాశాలు తగ్గాయని బాంబు పేల్చారు. తాజాగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కుల వివక్షత పై ఆయన స్పందించారు. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఈ సందర్భంగా మాట్లాడారు.

తాను దళితుడిని అని తెలిసిన తర్వాత సినిమా అవకాశాలు.. తగ్గిపోయాయని గుర్తు చేశారు బాబు మోహన్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. తాను దళితుడుని అని అందరికీ తెలిసిపోయిందని వివరించారు. దాంతో ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా దక్కలేదని ఎమోషనల్ అయ్యారు.

సినిమా ఇండస్ట్రీలో... ప్రతిభ కంటే కుల వివక్షత ఎక్కువ ఉందని... మండిపడ్డారు. అలా చేయడం వల్ల చాలామందికి అవకాశాలు దక్కకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ఇది మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. లేకపోతే దళితులకు అవకాశాలు దక్కే ఛాన్స్ లేదని.. పేర్కొన్నారు. దీంతో బాబు మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande