భద్రాద్రి దేవస్థానం పేరుతో వసూళ్లు..మండిపడ్డ రామాలయం అధికారులు
భద్రాచలం, 20 జూలై (హి.స.)విశాఖపట్నం బీచ్ రోడ్ లో గల అయోధ్య మోడల్ టెంపుల్ లో ఈ నెల 29న శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణం నిర్వహించడానికి భద్రాచలం దేవస్థానం నుండి ఆస్థాన పండితులు వస్తున్నారని, కళ్యాణం జరిపించుకోవడానికి టికెట్ ఖరీదు రు
భద్రాద్రి భద్రాచలం


భద్రాచలం, 20 జూలై (హి.స.)విశాఖపట్నం బీచ్ రోడ్ లో గల అయోధ్య మోడల్ టెంపుల్ లో ఈ నెల 29న శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణం నిర్వహించడానికి భద్రాచలం దేవస్థానం నుండి ఆస్థాన పండితులు వస్తున్నారని, కళ్యాణం జరిపించుకోవడానికి టికెట్ ఖరీదు రు. 2,999 అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో ఫై భద్రాచలం రామాలయం అధికారులు స్పందించారు. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆలయంలో నిర్వహించే స్వామివారి కళ్యాణానికి, భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని, భద్రాద్రి ఆలయం నుండి ఆస్థాన పండితులు ఎవరు వెళ్లడం లేదని ప్రకటించారు. భద్రాద్రి రామాలయం అధికారులు అనుమతి లేకుండా... భద్రాద్రి పేరుతో వసూళ్లకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలా భద్రాద్రి ఆలయం పేరు వాడుకుని వసూళ్లు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలు అక్కడ జరిగే కళ్యాణానికి, భద్రాద్రికి సంబంధం లేదని, భక్తులు ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande