హైదరాబాద్, 20 జూలై (హి.స.)
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల పండుగలు వస్తే.. ఆలయాలకు నిధులు అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్