హైదరాబాద్, 20 జూలై (హి.స.)
లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని నేడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.
బోనాలు ప్రశాంతంగా అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయని తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని వేడుకున్నానని అన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అమ్మవారికి మల్లుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మల్లు భట్టి విక్రమార్కని ఘనంగా సత్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..