ఇంటర్మేడియట్ 1,2 సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్దులకు తల్లికి.వందనం. ఆర్ధిక. సహాయం
అమరావతి, 20 జూలై (హి.స.) ప్రభుత్వ, ప్రైవేట్‌తోపాటు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9 ,10వ తరగతీ, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఈ పథకం ద్వారా 3.93 లక్
ఇంటర్మేడియట్ 1,2 సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్దులకు తల్లికి.వందనం. ఆర్ధిక. సహాయం


అమరావతి, 20 జూలై (హి.స.)

ప్రభుత్వ, ప్రైవేట్‌తోపాటు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9 ,10వ తరగతీ, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఈ పథకం ద్వారా 3.93 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయంలో 40 శాతం వాటాగా.. రూ. 382.66 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.

అలాగే 9, 10 తరగతుల ఎస్సీ డే- స్కాలర్ విద్యార్థులకు రూ.10,900 మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇక 9, 10 తరగతుల ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు రూ.8,800 నగదు మొత్తాన్ని ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో వేసింది. అదే విధంగా ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు.. మొత్తం ర్యాంకింగ్ ఆధారంగా 5,200 నుంచి 10,972 పిల్లల తల్లుల ఖాతాలోకి నగదును ప్రభుత్వం మళ్లించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande