.కొండాపురం గ్రామంలో ఓ వివాహిత మహిళ .ఆత్మహత్య
అమరావతి, 20 జూలై (హి.స.) బ్రహ్మసముద్రం, : కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మండలంలోని కోనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన కురుబ వన్నూరుస్వామి భార్య జ్యోతి(38) గత ఆర
.కొండాపురం గ్రామంలో ఓ వివాహిత మహిళ .ఆత్మహత్య


అమరావతి, 20 జూలై (హి.స.)

బ్రహ్మసముద్రం, : కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మండలంలోని కోనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన కురుబ వన్నూరుస్వామి భార్య జ్యోతి(38) గత ఆరేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతుండేది. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. తన భర్త సంపాదించిన డబ్బులన్ని తన వైద్యం ఖర్చులకే అవుతున్నాయని, తనకున్న ముగ్గురు ఆడపిల్లలను ఏవిధంగా పోషించాలని మధనపడుతుండేది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేంద్రకుమార్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande