హైదరాబాద్, 20 జూలై (హి.స.)
హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి నెలకొంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక నిర్వహించారు. అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించారు. కాగా, అంతకు ముందు ఎమ్మెల్యే కవిత ఉదయం కార్వాన్లోని దర్బార్ మైసమ్మను దర్శించుకోని బోనం సమర్పించారు. అలాగే హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్