భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసే అవకాశం రావడం నా అదృష్టం : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, 20 జూలై (హి.స.) భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పాతబస్తీ బోనాల వేడుకలలో భాగంగా ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సిటీ ఇంచార్జ్ మంత్రి పొన్నం
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పాతబస్తీ బోనాల వేడుకలలో భాగంగా ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సిటీ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా బోనాలు నిర్వహించుకుంటారని అన్నారు.

నిజాం నవాబు కూడా బోనాలలో పాల్గొనేవారని, 18వ శతాబ్దంలో రోగాలు వచ్చినప్పటి నుంచి ఆకులతో బోనాలు ఎత్తుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగు ప్రజలందరూ బాగుండాలని, ప్రతి ఒక్క కుటుంబం పిల్ల, పాపలతో సంతోషంగా ఉండాలని మొక్కుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో పాతబస్తీని న్యూ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande