హైదరాబాద్, 20 జూలై (హి.స.)
పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనంతో మొదలైన బోనాలు ఈ లాల్ దర్వాజ బోనాలతో చివరి అంకానికి చేరుకున్నాయి. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్‌దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో లాల్‌దర్వాజ బోనాల జాతర నేటి తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైంది. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్