హైదరాబాద్, 20 జూలై (హి.స.)
ప్రజా సమస్యల పోరాటంలో జైలుకు వెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్ పల్లిలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. పొద్దున లేస్తే మొదలు కేటీఆర్, కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా.. ఇబ్బందికి గురి చేసేలా ఫోన్ టాపింగ్, ఫార్ములా రేస్, కాలేశ్వరం అంటూ రోజులు గడిపేస్తున్నారన్నారని ఎమ్మెల్యే మాధవరం మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్