హైదరాబాద్, 20 జూలై (హి.స.)
సిరిసిల్ల పట్టణంలో అధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ముక్కోటి కుంకుమర్చానలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శ్రీ రాజాశ్యామల, శ్రీ వారాహి సహిత, శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ అష్టలక్ష్మి సహిత, శ్రీ లక్ష్మి నారాయణ దేవాలయాల 4వ వార్షికోత్సవం సందర్భంగా ముక్కోటి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు, గురుస్వామి రాచ విద్యాసాగర్ ఆధ్వర్యంలో నేడు ఆదివారం నుంచి ఈ నెల 29 వరకు కుంకుమార్చనలు జరుగుతాయి. మొదటి రోజైన ఆదివారం కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు శాకంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని కూరగాయలతో అందంగా అలంకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్