ఆదిలాబాద్., 20 జూలై (హి.స.)ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఆదివారం మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, పోలీసుల్ని పోడు రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్ల దాడి చేయడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళన కారుల దాడిలో పోలీస్ వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్