శాంతిపురం.వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో వెంకటేష్ మృతి
అమరావతి, 20 జూలై (హి.స.) తనకల్లు, బెంగళూరు నుంచి కృష్ణగిరికి మామిడి కాయలను తరలిస్తుండగా శాంతిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్‌ (27) మృతిచెందాడు. మండలంలోని మల్లిరెడ్డిపల్లి పంచాయతీ ఏటిగడ్డ యర్రబల్లికి చెందిన శంకరప్ప కుమారుడు వెంకటేశ్‌ ఏడాది
శాంతిపురం.వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో వెంకటేష్ మృతి


అమరావతి, 20 జూలై (హి.స.)

తనకల్లు, బెంగళూరు నుంచి కృష్ణగిరికి మామిడి కాయలను తరలిస్తుండగా శాంతిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్‌ (27) మృతిచెందాడు. మండలంలోని మల్లిరెడ్డిపల్లి పంచాయతీ ఏటిగడ్డ యర్రబల్లికి చెందిన శంకరప్ప కుమారుడు వెంకటేశ్‌ ఏడాది నుంచి డ్రైవర్‌గా పని చేస్తూ తల్లిదండ్రులను చూసుకునేవాడు. శనివారం ఉదయం శాంతిపురం మండలం రాళ్లబదుగూరు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో వెంకటేశ్‌ వాహనంలోనే ఇరుక్కొని అక్కడికక్కడే మృతిచెందాడు. పొక్లెయిన్‌తో వాహనాన్ని తొలగించి మృతదేహాన్ని వెలికి తీశారు. శంకరప్ప, గిరిజమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande