హైదరాబాద్, 20 జూలై (హి.స.)దేశంలో పురుషులే కాదు మహిళల్లో కూడా వ్యాపారం చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ (Jitendra Singh) ప్రకటించారు. ఈ క్రమంలో దేశంలో దాదాపు 76 వేల స్టార్టప్‌లు ఇప్పుడు మహిళలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటిలో చాలా వరకు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళలు, యువత శక్తివంతంగా ఉండడం వల్ల 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు