జస్టిస్ వర్మపై ఎఫ్ఎఆర్ నమోదు పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో..
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.) అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో ఎన్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ నన్ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బ
జస్టిస్ వర్మ


న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో ఎన్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ నన్ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మను ఏకవచనంతో సంభోదించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా పిలవడానికి ఆయన మీ స్నేహితుడా అని తప్పుబట్టింది. అయినప్పటికీ న్యాయమూర్తి స్థానానికి జస్టిస్ వర్మ అనర్హుడని చెప్పడంతో, ఉన్నత న్యాయస్థానానికి పాఠాలు నేర్పొద్దని అసహనం వ్యక్తం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande