హైదరాబాద్, 21 జూలై (హి.స.)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం సెక్రటేరియట్ లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై డిస్కస్ చేసి సూచనలు ఇవ్వనున్నారు. అదేవిధంగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఇటీవలే ప్రారంభించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పురగతిని అడిగి తెలుసుకోనున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కొత్తగా ప్రవేశపెట్టబోయే గిగ్ వర్కర్స్ బిల్లు పై కూడా సమీక్షించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు