తిరువనంతపురం, 21 జూలై (హి.స.)
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఎస్.యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత నెల 23వ తేదీన ఆయనకు గుండె పోటు రావడంతో హాస్పిట్‌లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
అచ్యుతానందన్ 2006 మే 18 నుండి 2011 మే 14 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1964లో CPI జాతీయ మండలి నుండి తప్పుకున్న 32 మంది నాయకులలో VS కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన CPM వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా ఉన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, CPM రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, LDF కన్వీనర్, ఇటీవల పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్ పదవితో సహా అనేక పదవులను ఆయన నిర్వహించారు. అయితే నాలుగేళ్ల క్రితం గుండెపోటు రావడంతో అప్పటి నుంచి VS క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..