హైదరాబాద్, 20 జూలై (హి.స.):
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్బంగా ఆ యా పార్టీల నేతలను ఆయన కోరారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రం ప్రయతిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్‌తో సహా ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని కీలక అంశాలకు కేంద్రం సమాధానమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని సైతం ఈ సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానమిస్తుందన్నారు.
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి అంటే.. జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూడిల్లీలో మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన రాజకీయ పార్టీల నేతలతో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు ఆయన సూచించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు