తెలంగాణ,వేములవాడ . 20 జూలై (హి.స.)
దక్షిణ కాశీగా పేరుగాంచిన
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణకు బీజం పడింది. ఇందులో భాగంగా భీమేశ్వర స్వామి వారి ఆలయంలో బాలాలయం నిర్మాణానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.3.44 కోట్లతో భక్తులకు క్యూ లైన్లు, షెడ్లు, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, చండీ హోమం మండపం, ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి ఆలయ విస్తీర్ణం చేపడుతున్నట్లు తెలిపారు.
దీనికి గాను 2023 - 24 బడ్జెట్ లో రూ. 50 కోట్లు, 2024- 24 లో రూ.100 కోట్లు కేటాయించినట్లు, మొదటగా రూ. 76 కోట్లతో పనులు చేపట్టడానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నామని, రెండు రోజుల క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు