జీవో నెంబర్ 49 ను వ్యతిరేకిస్తూ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతం..
తెలంగాణ, ఆదిలాబాద్. 21 జూలై (హి.స.) టైగర్ కారిడార్ పేరిట గిరిజనులు, గిరిజనేతరుల హక్కులకు విఘాతం కలిగించే జీవో 49 వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆసిఫాబాద్ , కాగజ్‌న‌గర్ అటవీ డివిజన్ లో 339 గ్రామాలపై ప్రభావం చూపే జీవో నెంబర్ 49 న
బంద్ ప్రశాంతం..


తెలంగాణ, ఆదిలాబాద్. 21 జూలై (హి.స.)

టైగర్ కారిడార్ పేరిట గిరిజనులు, గిరిజనేతరుల హక్కులకు విఘాతం కలిగించే జీవో 49 వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆసిఫాబాద్ , కాగజ్‌న‌గర్ అటవీ డివిజన్ లో 339 గ్రామాలపై ప్రభావం చూపే జీవో నెంబర్ 49 ను వ్యతిరేకిస్తూ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల ఎదుట బైఠాయించి ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉట్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అయితే మధ్యాహ్నం 12గంటల నుండి ఆర్టీసీ బస్సులు యధావిధిగా రోడ్డు ఎక్కాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసి ఉంచగా, ఆ తర్వాత తెరుచుకున్నాయి. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande