అమరావతి, 21 జూలై (హి.స.)
:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్‌ను విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ ప్రకటించారు. ఇటీవల అమరావతిలో జరిగిన రెండు రోజుల గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిక్లరేషన్ ప్రకటించింది. అమరావతిలో జరిగిన సమ్మిట్‌లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. 7 సెషన్స్‌గా జరిగిన ఈ సమ్మిట్‌లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండిలు పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి ప్రయోగాలు, సాంకేతికత, పెట్టుబడులపై చర్చలు సాగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ