గుంటూరు లోని.మల్లికా స్పిన్ సెంటర్ కు.బెస్ట్ పేపర్ అవార్డ్
గుంటూరు, 21 జూలై (హి.స.) గుంటూరులోని మల్లిక స్పైన్‌ సెంటర్‌ పరిశోధనా బృందం.. సొసైటీ ఫర్‌ మినిమల్లీ ఇన్‌వేజివ్‌ స్పైన్‌ సర్జరీ-ఆసియా పసిఫిక్‌ (ఎస్‌ఎంఐఎస్‌ఎస్‌-ఏపీ) వార్షిక సదస్సులో ప్రదర్శించిన పరిశోధనకు ‘బెస్ట్‌ పేపర్‌ అవార్డు’ లభించింది. భారత్‌లోని
గుంటూరు లోని.మల్లికా స్పిన్ సెంటర్ కు.బెస్ట్ పేపర్ అవార్డ్


గుంటూరు, 21 జూలై (హి.స.)

గుంటూరులోని మల్లిక స్పైన్‌ సెంటర్‌ పరిశోధనా బృందం.. సొసైటీ ఫర్‌ మినిమల్లీ ఇన్‌వేజివ్‌ స్పైన్‌ సర్జరీ-ఆసియా పసిఫిక్‌ (ఎస్‌ఎంఐఎస్‌ఎస్‌-ఏపీ) వార్షిక సదస్సులో ప్రదర్శించిన పరిశోధనకు ‘బెస్ట్‌ పేపర్‌ అవార్డు’ లభించింది. భారత్‌లోని వైద్య పరిశోధనకు ఈ అవార్డు లభించడం ఇదే మొదటిసారి. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ముంబైలో జరిగిన ఎస్‌ఎంఐఎస్‌ఎస్‌ ఆసియా ఫసిఫిక్‌ వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా ఎస్‌ఎంఐఎస్‌ఎస్‌-ఏఎఫ్‌ అధ్యక్షుడు జపాన్‌కు చెందిన ప్రొఫెసర్‌ కొటానీ ఈ అవార్డును ప్రకటించినట్టు ప్రముఖ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ జే నరేశ్‌బాబు ఆదివారం వెల్లడించారు. వచ్చే ఏడాది సింగపూర్‌లో జరిగే వార్షిక సదస్సులో ఈ అవార్డును అందజేయనున్నారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande