హైదరాబాద్, 21 జూలై (హి.స.)
తనపై సొంత పార్టీకి చెందిన వారే దాడికి యత్నించారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి తనపై జరిగిన దాడి గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పార్టీకి చెందిన వారే దాడికి యత్నించారని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఓ నేత నన్ను టార్గెట్ చేశారని వెల్లడించారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీకి ఫిర్యాదు చేశానన్నారు. ఆ వెంటనే తన సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఆదివారం తనపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారేనని చెప్పారు. అందులో ముగ్గురిని గుర్తించామని, పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్