తెలంగాణ, పెద్దపల్లి. 22 జూలై (హి.స.)
పోలీసులు తమ విధులను క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కాపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలి అని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో వారు మొక్కలు నాటారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు