వర్షాల వల్ల ఇబ్బందుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్.. నిజామాబాద్ కలెక్టర్
తెలంగాణ, నిజామాబాద్. 22 జూలై (హి.స.) ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని నిజామాబాద్ జిల్లా క
నిజామాబాద్ కలెక్టర్


తెలంగాణ, నిజామాబాద్. 22 జూలై (హి.స.)

ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24/7 పని చేస్తుందని, ఏ సమయంలో నైనా ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం తెలుపవచ్చని అన్నారు. సమాచారం అందించిన వెంటనే వర్షాల తాకిడికి లోనైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande