ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి, సన్న బియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే మా లక్ష్యం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి
తెలంగాణ, నల్గొండ. 22 జూలై (హి.స.) రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


తెలంగాణ, నల్గొండ. 22 జూలై (హి.స.)

రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదలకు మేం ఆశ చూపించాం. ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి, సన్న బియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే మా లక్ష్యం, అని చెప్పారు. గతంలో రేషన్ ద్వారా వచ్చిన నాణ్యతలేని బియ్యం దళారుల చేతిలో పోయేదని, ఇప్పుడు ప్రతి పైసా నిజమైన లబ్ధిదారులకే ఉపయోగపడేలా ప్రభుత్వం వ్యవస్థను మెరుగుపరిస్తోందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande