తెలంగాణ, ఖమ్మం. 21 జూలై (హి.స.)
దళిత బంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయి. ఎంచుకున్న వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ దశలవారీగా పొందాల్సిన నిధులను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత నిధులకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తాను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, దళిత బంధు లబ్ధిదారులందరికీ నిధుల పంపిణీ కొనసాగుతుందని ఎన్నికల తదుపరి తాను ప్రకటించినట్టుగా ఈరోజు చెక్కుల పంపిణీ చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు